Share News

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:21 AM

అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్‌ ఎక్స్‏ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

- 27 నుంచి పురంలో వందే భారత్‌కు స్టాపింగ్‌

హిందూపురం(అనంతపురం): యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు ఈనెల 27నుంచి హిందూపురం(Hindupuram)లో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఎంపీ బీకే పార్థసారథి హిందూపురంలో వందేభారత్‌ రైలు ఆపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సోమన్నను కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఈనెల 27నుంచి హిందూపురంలో రెండు నిమిషాలపాటు ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


panndu1.3.jpg

20704, 20703 నంబర్ల రైళ్లు ఆపనున్నారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ మంత్రి సోమన్న, ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి, ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 11:21 AM