Share News

ED Raids: రేణిగుంటలో చైనా దేశస్తుడి ఇంట్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 08:11 PM

తిరుపతి జిల్లా రేణిగుంలో చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉంటున్న డ్యూయాంగన్ అనే చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఇతడిపై గతంలో వీసా ఉల్లంఘన కేసు నమోదైందని, ప్రస్తుతం ఇతను బెయిల్‌పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ED Raids:  రేణిగుంటలో చైనా దేశస్తుడి ఇంట్లో ఈడీ సోదాలు

తిరుపతి: రేణిగుంలో చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉంటున్న డ్యూయాంగన్ అనే చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఇతడిపై గతంలో వీసా ఉల్లంఘన కేసు నమోదైందని, ప్రస్తుతం ఇతను బెయిల్‌పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బిగ్ కిచెన్ పేరుతో చైనా కంపెనీలలో పనిచేసే చైనీయులకు ఆహారం సప్లై చేసేవాడని తెలుస్తోంది. వీసా నిబంధనలను ఉల్లంఘించడం, వివిధ కంపెనీల పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తూ పన్నులు చెల్లించకుండా ఉండడంతో, డిల్లీ, చెన్నై నుంచి వచ్చిన ఈడీ అధికారులు.. డ్యూయాంగ్ నివాసంలో సోదాలు చేశారు. అలాగే పలు కంపెనీలతో డ్యూయాంగ్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.


ఈ క్రమంలో ఏర్పేడు మండలం వికృతమాలలో డ్యూయాంగన్ నిర్వహిస్తున్న స్ర్కాప్ గౌడన్‌లో సైతం ఈడీ అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా రేణిగుంటలోని అతడి ఇంటి వద్దకు బ్యాంకు అధికారులను పిలిపించి మరీ విచారించారు. ఇదిలావుండగా, రేణిగుంట పీఎస్‌లో 2021 సంవత్సరంలో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ, అనధికారికంగా నివాసం ఉండటంపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో డ్యూయాంగన్ పాస్ పోర్టు సీజ్ చేసిన రేణిగుంట పోలీసులు.. తిరుపతి కోర్డుకు అప్పగించారు. అప్పటి నుండి రేణిగుంటలో ఉన్న డ్యూయంగన్.. రూ.కోట్లలో వ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తోంది.


Also Read:

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..

మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..

అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం

Updated Date - Oct 08 , 2025 | 08:55 PM