Road Accidents: ఒకే సమయంలో రెండు ప్రమాదాలు..
ABN , Publish Date - Mar 12 , 2025 | 08:42 AM
ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..

తూర్పుగోదావరి జిల్లా: ఏపీ (AP)లో బుధవారం తెల్లవారు జామున వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి (Two dead) చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఆయా సంఘటన ప్రదేశాలకు వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..:
అన్ని కేసుల్లో పోసానికి బెయిల్.. విడుదలకు బ్రేక్..
ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసి బస్సు.. లారీని ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో ప్రమాదం..
ఏలూరు శివారు జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును వెనుక నుండి కంటైనర్ లారీ ఢీ కొంది. సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుండి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వెనుక సీట్లలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తర్వాత కంటైనర్ లారీ డ్రైవర్ , క్లీనర్ పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో..
అన్నమయ్య జిల్లా: మదనపల్లి - కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికుల మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చిత్తూరులో...
దొంగల దాడి నుంచి గోడ షాపు యజమాని దూకి తప్పించుకున్నాడు. గోడ దూకే సందర్భంలో ఆయన స్వల్పంగా గాయపడ్డాడు. షాపు లోపలకు చొరబడ్డ దొంగలను షట్టర్ వేసి బయటకు రానీకుండా యజమాని బంధించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సినిమా తరహాలో స్థానికుల సహాయంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ చేశారు. నలుగురు వ్యక్తులను పట్టుకొని బయటకు తీసుకువచ్చారు.వారి వద్ద నుంచి రెండు గన్నులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రాంతానికి స్థానికులు భారీగా చేరుకున్నారు. దొంలు చిత్తూరు, తమిళనాడు, కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News