YSRCP: ఆవిర్భావ వేడులకు పేర్ని నాని పిలుపు.. అడ్డుకున్న పోలీసులు..
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:07 AM
కోర్టు ఉత్తర్వులను పేర్ని నాని బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు పేర్ని కిట్టు కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీపై అక్రమంగా ర్యాంప్ నిర్మాణం చేపట్టారు.

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) మచిలీపట్నంలో కవ్వింపు చర్యలకు దిగారు.స్టేటస్కో (Statusco) ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (YSRCP Foundation Day) పిలుపిచ్చారు. జిల్లా నాయకత్వం అంతా రావాలని కోరారు. స్టేటస్కో ఉన్న కార్యాలయంలో వేడుకలు ఎలా చేస్తారని అధికార పార్టీ నేతలు ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవని అధికారులు నోటీసులు (Notices) ఇచ్చారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్కో ఇచ్చింది.
Also Read..:
అయితే కోర్టు ఉత్తర్వులను పేర్ని నాని బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పేర్ని నానితోపాటు అతని కుమారుడు పేర్ని కిట్టు కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీపై అక్రమంగా ర్యాంప్ నిర్మాణం చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్టేటస్కో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని డీఎస్పీ సిహెచ్ రాజా పేర్ని నానిని కోరారు.పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుతో పాటు అక్కడున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులందరినీ అక్కడి నుండి పంపివేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News