Kakinada: యానాంలో ONGC గ్యాస్‌పైప్ లైన్ లీక్.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 08:44 AM
ONGC గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరుచుగా ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు.
కాకినాడ : యానాంలో ONGC గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. సముద్రం నుంచి యానాం మీదుగా వెళ్లే.. చమురు సంస్థల గ్యాస్‌పైప్ లైన్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో.. సమీప గ్రామాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అధికారులుకు సమాచారం అందించారు. అప్రమత్తమైన చమురు సంస్థల అధికారులు గ్యాస్ సరఫరాను సముంద్రంలోనే నిపివేశారు.
అయితే ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తరుచుగా జరుగున్న ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి అన్ని గ్యాస్ పైప్‌లైన్‌ల సమీపంలో భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించడం చాలా అవసరమని చెబతున్నారు. అలాగే.. ప్రజలు గ్యాస్ లీక్ వాసన వచ్చినట్లయితే లేదా ఏదైనా అనుమానించినట్లు అనిపించిన వెంటనే తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.
అయితే గతంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ONGC బావిలో రీ-డ్రిల్లింగ్ కార్యకలాపాల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా, ఆ సమయంలో భారీగా గ్యాస్ వ్యాపించి స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్