Srikakulam: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు..
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:38 PM
ఏపీలోని శ్రీకాకుళలం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) ఈ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రి తరలించారు. ఈ గొడవకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News