Share News

Tirupati: తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 07:55 AM

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు.

Tirupati: తిరుమలలో  సాలకట్ల వసంతోత్సవాలు..
Tirumala Tirupathi Devastanam

తిరుపతి: తిరుమల (Tirumala)లో గురువారం నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు (Vasanthotsavams) అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఆలయం వెనుక వైపున వున్న వసంతమండపంలో వసంతోత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి (Sri Devi ), భూదేవి (Bhudevi) సమేత మలయప్పస్వామి (Malayappaswamy) స్వర్ణ రధం (Gold chariot)పై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు (Devotees) దర్శనం ఇవ్వనున్నారు. కాగా వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు.

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

Also Read..: ఈ రోజు బంగారం, వెండి ధరలు...


రెండవరోజు శుక్రవారం భూ సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. మూడో రోజు (చివరిరోజు) శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఈరోజు తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. కాగా ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ అధికారులు రద్దు చేసారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రుణగ్రహీతలకు ఊరట

నేవీ అమ్ములపొదిలో రాఫెల్‌ ఫైటర్లు

రాష్ట్రానికి కేంద్రం వరాలు

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 07:55 AM