AP News: ఏపీలో అమానుష ఘటన.. భార్యని హత్య చేసిన భర్త
ABN , Publish Date - Jul 19 , 2025 | 10:23 AM
ఏపీలో అమానుష ఘటన జరిగింది. కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానంతో భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతి రూరల్‌లోని మంగళం రిక్షా కాలనీ పరిధిలో జరిగింది. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భార్య ఉషాపై కోపంతో భర్త లోకేశ్వర్ హత్య చేశాడు.
తిరుపతి: ఏపీలో అమానుష ఘటన జరిగింది. కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానంతో భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతి రూరల్‌లోని మంగళం రిక్షా కాలనీ పరిధిలో జరిగింది. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భార్య ఉషా(34)పై కోపంతో భర్త లోకేశ్వర్ హత్య చేశాడు. మృతురాలు అమర్ రాజా ఫ్యాక్టరీలో ఉద్యోగిని. ఉదయం 5 గంటలకు ఆమె డ్యూటీకి వెళ్తుండగా దారికాచి భర్త లోకేశ్వర్ హత్య చేశాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ఉష తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. లోకేశ్వర్ జులాయిగా తిరుగుతూ ఉండటంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సీ రవి మనోహరాచారి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్, మంగళం క్లస్టర్ ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి పరిశీలించారు. భార్య హత్య అనంతరం తిరుమల నగర్‌లో భర్త లోకేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. భార్త, భర్తలు మృతిచెందడంతో వీరి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News