Share News

YSRCP Violence.. టీడీపీ శిబిరంపై వైఎస్సార్‌సీపీ నేతల దౌర్జన్యం..

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:18 PM

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి టీడీపీ శిబిరంపై వైఎస్సార్‌సీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్‌ను భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు.

YSRCP Violence.. టీడీపీ శిబిరంపై వైఎస్సార్‌సీపీ నేతల దౌర్జన్యం..
YSRCP Violence..

తిరుపతి: డిప్యూటీ మేయర్ ఎన్నిక (Tirupati Deputy Mayor Election) వాయిదా (Postponement)పడింది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఆదివారం రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా (High Drama) కొనసాగుతోంది. ఆదివారం రాత్రి టీడీపీ శిబిరం (TDP camp)పై వైఎస్సార్‌సీపీ నేతలు (YSRCP Leaders) దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్‌ను వైఎస్సార్‌సీపీ నేత భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. కోరం 25 మంది ఉండాలి. అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. ఒక వేళ మంగళవారం కూడా వాయిదా పడితే.. ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చి.. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి..

భూమనకు టీడీపీ కార్యకర్త సవాల్..


ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తమకు 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ ఆఫిషియో నెంబర్లు.. మొత్తం 50 మంది. అయితే తమకు 23 మంది ఉన్నారని, ఇద్దరు తగ్గారని, ఆ ఇద్దరు ఆస్పత్రికి వెళ్లారని.. దీంతో కోరం లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అసలు కార్పొరేటర్ల సంఖ్యే లేదని, వాళ్లు ఎన్నికకు రాకుండా బయట ఉండి.. ఎన్నిక వాయిదా వేయాలనే దురుద్దేశంతో అలజడి సృష్టించారని అన్నారు. ఆ పార్టీలో ఉండే కార్పొరేటర్లు అందరూ కూటీమికి మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


ఇక్కడ మేయర్‌కే గౌరవం లేదని.. గత మూడున్నరేళ్లలో సభలో కార్పొరేటర్లకే కాదు.. మేయర్‌కు కూడా మైక్ ఇవ్వరని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్‌కు ప్రత్యేక స్థానం కల్పించిందని అన్నారు. వైఎస్సార్‌సీపీలో గౌరవం లేకపోవడంతో ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లందరూ కూటమిలో చేరారని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిడ్నాప్ చేసే సంస్కృతి ఎన్డీయే కూటమికి లేదని.. అది వైఎస్సార్‌సీపీ నేత కరుణాకర్ రెడ్డికే చెల్లుతుందని అన్నారు. కాగా మంగళవారం ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


మరోవైపు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కూటమిలో చేరారు. పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతున్న కార్పొరేటర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు. తమకు కావాల్సిన డిప్యూటీ మేయర్‌ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ కార్పొరేటర్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక..

అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..

ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 03 , 2025 | 01:19 PM