AP News: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక..
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:51 AM
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. టీడీపీ నేత ఎన్నిక అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ప్రారంభమైనప్పుడు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. కౌన్సిలర్లు చేజారి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ క్యాంపు నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంకు.. అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు.

శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ (Hindupur Municipal Corporation) పదవి తెలుగుదేశం (TDP) కైవశం (Capture) అయింది. చైర్మన్‌గా అరవ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ (Ramesh Kumar)ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. 13 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైంది. దీంతో టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు బాణా సంచా కల్పి సంబరాలు చేసుకుంటున్నారు. హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం వార్డులు 38 ఉన్నాయి, సోమవారం ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 38 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 21 మంది కౌన్సిలర్లుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుతో చైర్మెన్ గా రమేష్ కుమార్ ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఆరవ వార్డ్ కౌన్సిలర్ రమేష్ కుమార్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.
ఈ వార్త కూడా చదవండి..
అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
కాగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ప్రారంభమైనప్పుడు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. కౌన్సిలర్లు చేజారి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ క్యాంపు నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంకు.. అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు.
హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 వార్డలకు గానూ.. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ, బీజేపీ బలం 10 కాగా.. 13 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. దాంతో టీడీపీ బలం 23కు చేరింది. వైఎస్సార్‌సీపీకి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేసింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపురంలో పోలీస్ 30 యాక్ట్ తో పాటు 144 సెక్షన్ విధించారు. అయితే విజయోత్సవ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ నుంచి రమేష్ కుమార్, వైఎస్సార్‌సీపీ నుంచి వెంకట లక్ష్మి పోటీపడ్డారు.
మరోవపై తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కూటమిలో చేరారు. జగన్ పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతున్న కార్పొరేటర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గతంలో జరిగినట్లు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ప్రశాంతంగా వెళ్లి తాము ఓటు వేస్తున్నామని చెప్పారు. తమకు కావాల్సిన డిప్యూటీ మేయర్‌ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ కార్పొరేటర్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..
ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News