Share News

Crowd In Kapila Theertham: మహాలయ అమావాస్య ఎఫెక్ట్.. కపిల తీర్థానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:04 AM

మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు.

Crowd In Kapila Theertham: మహాలయ అమావాస్య ఎఫెక్ట్.. కపిల తీర్థానికి పోటెత్తిన భక్తులు

తిరుపతి, సెప్టెంబర్ 21: మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతిలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు. కపిలతీర్థంలో పిండాలు, తర్పణాలు వదిలేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలోకి భక్తులు వెళ్లే క్రమంలో కొద్దిగా తోపులాట చోటు చేసుకుందని తెలుస్తోంది. దాంతో టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.


క్యూ మార్గంలో భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లేలా చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు, ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు పోటెత్తనున్నారు. ఆ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా.. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే ఈ తోపులాట వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచన

క్యాప్స్ గోల్డ్‌‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..

For More AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 03:41 PM