Yanamala Sensational Comments On Jagan: జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచన
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:51 AM
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు.
అమరావతి, సెప్టెంబర్ 21: ఎమ్మెల్యేగా ఎన్నికై.. అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో యనమల రామకృష్ణుడు విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. అసెంబ్లీని బహిష్కరిస్తామనడం ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. అనర్హత వేయడంతోపాటు తదుపరి ఎన్నికల్లో ఇలాంటి వారు పోటీ చేయవచ్చో? లేదో? అనే విషయం సైతం న్యాయస్థానం తేల్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాకుంటే.. వారిపై అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
ఈ నిబంధన వైఎస్ జగన్‌తోపాటు ఆయన ఎమ్మెల్యేలకు అర్థం కాకుంటే.. వాళ్ల న్యాయమూర్తిని అడిగి తెలుసుకోవాలంటూ సూచించారు. ఇక అనర్హత వేటు నిబంధన ఏమిటంటూ వైఎస్ జగన్ అడగటం హాస్యాస్పదంగా ఉందని యనమల రామకృష్ణుడు వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) చదివితే.. నిబంధనలు అర్థమవుతాయంటూ వైఎస్ జగన్‌కు యనమల రామకృష్ణుడు సూచించారు. రాజ్యాంగ నిబంధనలు చదువుకుని.. వాటి సారాంశం అర్థం చేసుకుంటే.. ఈ తరహా సందేహాలు రావంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలని.. అలా అయితేనే అసెంబ్లీకి హాజరవుతానంటూ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రడికి వైఎస్ జగన్ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఈ హోదా వస్తుందంటూ వైఎస్ జగన్‌కు స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో ఈ అంశంపై ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు.
అదీకాక.. వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అటు వైపు వాళ్లు వెళ్లలేదు. ఇక వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలంటూ అధికార పక్షం నేతలు సూచిస్తున్నారు. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ.. అసెంబ్లీకి హాజరుకావడం లేదు. దీంతో వారిపై అనర్హత వేటు వేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందనే చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహాలయ అమావాస్య ఎఫెక్ట్.. కపిల తీర్థానికి పోటెత్తిన భక్తులు
క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
For More AP News And Telugu News