IT Raids In Caps Gold: క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ABN , Publish Date - Sep 21 , 2025 | 09:31 AM
క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో ఐటీ దాడులు.. వరుసగా ఐదో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి. ఇప్పటికే ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ నగరాల్లో క్యాప్స్ గోల్డ్‌లో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు సైతం ఈ సోదాలు నిర్వహిస్తు్న్నారు. అయితే సికింద్రాబాద్‌లోని ఆవుల మంద ప్రాంతంలోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. అయితే ఈ క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో లాప్ ట్యాప్, పెన్ డ్రైవ్‌లతోపాటు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఇక శనివారం క్యాప్స్ గోల్డ్ అనుబంధంగా ఉన్న క్యాసా జూలరీస్‌ను సైతం ఐటీ అధికారుల బృందం చేసిన విషయం విదితమే.
ఇప్పటికే ఈ సోదాల్లో భాగంగా చందా శ్రీనివాస్, చందా అభిషేక్‌లను ఐటీ అధికారులు విచారించారు. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయిల బిజినెస్ క్యాప్సి గోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ పలు ప్రాంతాలలో తమ బంధువులను బినామీలుగా క్యాప్స్ గోల్డ్ యాజమాన్యం ఉంచినట్లు ఈ సోదాల్లో గుర్తించారు. పెద్ద మొత్తంలో బంగారం స్కీములను క్యాప్స్ గోల్డ్ నడిపిస్తుంది. మరోవైప నగదు లావాదేవీలలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇంకోవైపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ప్రాంతంలోని మహంకాళి స్ట్రీట్ మార్గంలోని సదరు కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏం చేసినా కలిసి రావడం లేదా?.. మహాలయ అమావాస్య రోజు..
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల..
Read Latest Telangana News And Telugu News