Tirumala Brahmotsavam 2025: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల..
ABN, Publish Date - Sep 21 , 2025 | 08:58 AM
భాద్రపద మాసం ఆదివారంతో.. అంటే నేటితో ముగియనుంది. సోమవారం నుంచి అంటే.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే తిరుమలలో కొలువు తీరిన ఆ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మాత్రం మంగళవారం నుంచి అంటే.. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
1/12
భాద్రపద మాసం ఆదివారంతో ముగియనుంది. సోమవారం నుంచి అంటే.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.
2/12
అయితే తిరుమలలో కొలువు తీరిన ఆ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మాత్రం మంగళవారం నుంచి అంటే.. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
3/12
ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువు తీరిన ఆ మూల విరాట్‌ను దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు.. తిరుమలకు పోటెత్తనున్నారు.
4/12
కోట్లాది మంది భక్తులు ఆ స్వామిని దర్శించి.. పునీతులు కానున్నారు. అలాంటి వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
5/12
భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
6/12
మరోవైపు తిరుమలలోని స్వామి వారి దేవాలయంతోపాటు నగర వీధుల్లో స్వామి వారికి సంబంధించిన చిత్రాలను ప్రత్యేక లైటింగ్‌తో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
7/12
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు ఇవి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తు్న్నారు.
8/12
అదీకాక టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల మరోసారి బాధ్యతలు చేపట్టారు. గతంలో సైతం ఆయన టీటీడీ ఈవోగా విధులు నిర్వర్తించారు. ఆయనకు సైతం ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై మంచి అవగాహన ఉందనే చర్చ సైతం ఉంది.
9/12
దాంతో ఈ సారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక సెప్టెంబర్ 24వ తేదీన స్వామి వారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
10/12
ఇంకోవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, భక్తుల రద్దీ, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుమలలో వేలాది మంది పోలీసులు మోహరించారు.
11/12
ఈ బ్రహోత్సవాల్లో భాగంగా తిరుమల మాడ వీధుల్లో స్వామి వారు.. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
12/12
అక్టోబర్ 2వ తేదీతో ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Updated at - Sep 21 , 2025 | 08:59 AM