Mahalaya Amavasya: ఏం చేసినా కలిసి రావడం లేదా?.. మహాలయ అమావాస్య రోజు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:55 AM
మనం ఎంత ప్రయత్నాలు చేసినా.. ఫలితం దక్కదు. చేతి దాకా వచ్చిన పలితం.. కళ్ల ఏదుటే చేజారి పోతుంది. మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ తీవ్ర మనోవేదనకు గురవుతాం. అలాంటి వారు ఈ ఒక్క పని చేస్తే అన్ని కలిసి వస్తాయి.
ఒకొక్కసారి మనం ఎంత కష్టపడినా.. ఫలితం మాత్రం దక్కదు. ఇంకా చెప్పాలంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చేతికి అందినట్లే అంది.. చేజారిపోతోంది. ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కాదు. జ్యోతిష్య పండితులను కలిసిన.. వాళ్లు చెప్పే పరిహారాలు పాటించిన.. ఫలితం మాత్రం దక్కదు. దీంతో మనకే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటూ పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు. అటువంటి వారిని పితృదోషం వెంటాడుతొందని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ దోషం కారణంగానే వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని వారు వివరిస్తున్నారు. ఈ తరహా దోషాలను తొలగించుకునేందుకు ఈ మహాలయ పక్షాలు చక్కగా ఉపయోగపడతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ పక్షాల్లో ఏదో ఒక రోజు.. పెద్దలను స్మరించుకుంటూ వారి శ్రద్ధ కర్మలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా చేయలేకున్నా .. కనీసం మహాలయపక్ష అమావాస్య రోజు అయినా అలా చేయడం వల్ల.. పెద్దల ఆశీర్వాదం తప్పక ఉంటుందని పండితులు ఉవాచ.
ఈ ఏడాది భద్రపద మాసం చివరి రోజు అంటే.. సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ పక్ష అమావాస్య వచ్చింది. ఈ రోజు.. పితృ దేవతలను తలుచుకుని వారికి తర్పణం వదలాలి. తద్వారా వంశంలోని పెద్దల దీవెనలు మనపై తప్పక ఉంటాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
పంచమ వేదం మహాభారతంలో సైతం ఈ మహాలయ అమావాస్యను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అమావాస్య రోజు.. పితృ శ్రాద్ధాలు, అన్న సంతర్పణ చేయడం వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయని వారు చెబుతున్నారు. ఇవి చేయడానికి సమయం చిక్కని వారు.. కనీసం బియ్యం, పప్పు, ఉప్పు తదితర ఆహార పదార్థాలను ఏ దేవాలయానికో వెళ్లి బ్రాహ్మణులకు స్వయంపాకంగా అందజేసిన మంచి ఫలితాలు తప్పక సంప్రాప్తిస్తాయని విశదీకరిస్తున్నారు.
అలాగే వృద్దులు, పేదలు, ఆపదల్లో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల సైతం శుభం జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. మహాలయ పక్ష అమావాస్య రోజు.. పితృ దేవతల ఆరాధన వల్ల దేవతలను పూజించడం కంటే ఎన్నో రెట్లు అధిక పుణ్య ఫలం దక్కే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు పితృ తర్పణ వల్ల గతించిన ఏడు తరాలు సంతసిస్తాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
ఈ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..
For More Devotional News And Telugu News