Mahahlaya Amavasya: పుర్వీకుల అనుగ్రహం కోసం..
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:49 AM
కుటుంబంలో పెద్దలను కోల్పోయిన వారు.. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పని సరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు.. కనీసం మహాలయ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చాలంటారు.
దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను సైతం అదే విధంగా ఆరాధించాలి. అలా ఆరాధించేందుకు పితృపక్షాల సమయంలో తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని విశ్వసిస్తారు. మరి ముఖ్యంగా మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య రోజు.. పెద్దలకు తర్పణం వదిలితే ఏడాదంతా పితృ దేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

ఈ మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం..
కుటుంబంలో పెద్దలను కోల్పోయిన వారు.. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పని సరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు.. కనీసం మహాలయ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చాలంటారు.
మహాలయ పక్షం రోజుల్లో తర్పణాల వల్ల పితృ దేవతల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం వచ్చింది. ఇక సాధారణంగా హిందూ సంప్రదాయంలో అమావాస్య రోజు శుభకార్యాలు చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఈ సారి మహాలయ అమావాస్య ఆదివారం వచ్చింది. దీంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది.
ఎవరైనా ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే.. వాళ్లకు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు తప్పక కలుగుతాయంటారు. కానీ ప్రతి అమావాస్య రోజు.. పితృదేవతలకు తర్పణం వదలాలి. ఏడాదిలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. కానీ 11 అమావాస్యల రోజు చేయలేనిది.. భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ అమావాస్య) రోజు.. తర్పణం వదిలితే.. ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని పండితులు వివరిస్తున్నారు. ఆ రోజు పితృ దేవతల అనుగ్రహం కోసం పరిహారాలు తప్పక పాటించి తీరాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
వచ్చే ఆదివారం అమావాస్యకి అంత పవర్ ఉందా..?
For More Devotional News And Telugu News