CM Chandrababu Family in Tirupati: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:02 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. తిరుమల గాయత్రి నిలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి రాత్రి 7:30 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకోనున్నారు. అక్కడ పూజల అనంతరం 7:40 గంటలకు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News