Massive Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:02 PM
చిత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు.
చిత్తూరు: చిత్తూరులో (Chittoor) దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు - కాట్పాడి రైల్వేమార్గం సిద్ధంపల్లి వద్ద నిన్న (బుధవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి ఈ దారుణానికి దొంగల ముఠా పాల్పడ్డారు.
ఈ ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు స్టేషన్‌కి రావాలంటేనే జంకుతున్నారు. అయితే ఇంత జరిగిన ఈ ఘటనను గోప్యంగా రైల్వే పోలీసులు ఉంచారు. ఈ ఘటన నేపథ్యంలో చిత్తూరు రైల్వే స్టేషన్‌లోకి భారీగా పోలీసు బలగాలు చేరి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News