AP GST Officer Suspended: ఏపీ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్..
ABN , Publish Date - Sep 23 , 2025 | 08:10 AM
జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతి: జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ.. సుభాష్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు రావడంతో.. ఆయనను ప్రభుత్వం వివరణ కోరింది. దానికి ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ రిప్లై ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం.. సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు