CM Chandrababu Naidu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:16 AM
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్, గాడ్ స్వ్కాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో సీఎం పర్యటించనున్నట్లు తెలిపారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం విజయవాడలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికి ఆయనతో సమావేశం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభకానున్న సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తర్వాత శ్రీవారి ప్రసాదాల కోసం ఏర్పాటు చేసిన మిషన్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభిస్తారు.
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్, గాడ్ స్వ్కాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ పర్యటనలో ఆయన తిరుమల దేవస్థానం అధికారులతో కూడా సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్ష జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై దృష్టి సారించినప్పటికీ, చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రజల వ్యక్తిగత వేడుకలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
జనాభా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు.. నెం.2, 3 స్థానాల్లో తెలంగాణ, ఏపీ
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు