Satish Kumar Case: ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ పోస్టుమార్టం నివేదికపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:18 PM
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ కేసులో పలు కోణాల్లో అనంతపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
అనంతపురం, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ (Satish Kumar Case) పోస్టుమార్టమ్ నివేదికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం పోలీసులు. నిన్న(శనివారం) గుంతకల్లు - తాడిపత్రి రూట్‌లోని రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందికి తోసివేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సతీశ్ కుమార్‌కు సమానమైన బరువు ఉన్న ఓ బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ రెండు అడుగులు పడగా, మరో బొమ్మ ఐదు నుంచి పది అడుగుల దూరంలోనే పడటంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీన్ రీ రీకన్‌స్ట్రక్షన్‌ను స్వయంగా పర్యవేక్షించారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్.
మరో వైపు.. సతీశ్‌కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈనేపథ్యంలోనే గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నారు. అయితే, సతీశ్ కుమార్ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు అనంతపురం జిల్లా పోలీసులు.
13వ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ప్రయాణించిన 1140 మంది ప్రయాణికుల లిస్ట్‌ను సేకరించారు పోలీసులు. ప్రయాణికుల్లో పాత నేరస్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగిన సీన్ రిక్రియేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినంత వేగంతో ఇతర రైళ్లు ఏవీ.. వెళ్లకపోవడంతో మరోసారి సీన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు అనంతపురం పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
Read Latest AP News And Telugu News