PM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:33 PM
ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయి బాబాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
శ్రీ సత్యసాయి జిల్లా, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు.
ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ
మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు
Read Latest AP News And Telugu News