Share News

Satyakumar: కూటమిలో విబేధాల ప్రచారంపై మంత్రి సత్యకుమార్ స్పందన

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:24 AM

Satyakumar: కూటమి నేతల మధ్య దూరం అనే ప్రచారంపై స్పందించారు మంత్రి సత్యకుమార్. అదంతా దుష్ట్రచారం మాత్రమే అని స్ఫష్టం చేశారు. అంతా కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Satyakumar: కూటమిలో విబేధాల ప్రచారంపై మంత్రి సత్యకుమార్ స్పందన
Minister Satyakumar

అనంతపురం, ఫిబ్రవరి 15: కూటమిలో విబేధాల ప్రచారంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల మధ్య దూరం అనేది దుష్ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. ధర్మవరంలో కూటమి మధ్య విబేధాలు అసలే లేవని తామంతా కలిసే పని చేస్తున్నామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) నేతృత్వంలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ కోసం సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఫోన్‌లో సంప్రదించాలని చూశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం యాత్రకు వెళ్లారన్నారు. ఒక్కోసారి కేబినెట్ మీటింగ్‌లకు తాము కూడా వెళ్లలేకపోవచ్చని.. అంత మాత్రన విబేధాలు ఉన్నాయనడం సరికాదన్నారు.


ఆందోళన వద్దు...

జీబీఎస్ వైరస్‌పై (GBS Virus) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కేవలం 17 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. మరణాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని.. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. బర్డ్ ఫ్లూ (Bird Flu) ఎక్కడా మనుషులకు సంక్రమించలేదని.. చికెన్ విషయంలో ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) క్లారిటీ ఇచ్చారని తెలిపారు.

తమన్‌కు బాలయ్య భారీ గిఫ్ట్‌


వైద్యం కోసం లక్ష కోట్లు..

కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ సాధన దిశగా ఉందన్నారు. వైద్య, ఆయుష్ మీద 12 శాతం నిధులు పెంచామన్నారు. వైద్యం కోసమే లక్ష కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన 30 రకాల మందులపై జీఎస్టీ, ఇతర ట్యాక్సులు తగ్గించామన్నారు. 75 వేల మెడికల్ సీట్లు పెంచే దిశగా వెళ్తున్నామన్నారు. ఏపీకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతోందని.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..

రైతన్నకు అండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 15 , 2025 | 11:24 AM