PM Fasal Bima: రైతన్నకు అండగా.. పంట బీమా పాలసీలను అందిస్తున్న ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్..
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:57 AM
రైతన్నకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నడుం బిగించింది.

రైతన్నకు (Farmer) ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI General Insurance) సంస్థ నడుం బిగించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో కలిసి ``మేరీ పాలసీ మేరే హాథ్`` క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు జరగనుంది. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తోంది (PM Fasal Bima).
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రైతులకు వారి ఇంటి దగ్గరే పంట బీమా పాలసీ పత్రాలను అందజేస్తారు. అలాగే, పంట బీమా ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెంచుతున్నారు. పంట బీమా ప్రాసెస్‌లో పారదర్శకతను పెంచడంపై ``మేరీ పాలసీ మేరే హాథ్`` క్యాంపెయిన్ దృష్టి సారిస్తుంది. ఈ పథకంలో భాగంగా రైతుల ఖరీఫ్, రబీ పంటలకు బీమా చేస్తారు. కేవలం రెండు శాతం ప్రీమియంగా చెల్లిస్తే చాలు.. మిగతా ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులకు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం వాటిల్లితే ఈ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ప్రభుత్వం రూ. 60 వేల వరకు నష్టపరిహారం చెల్లిస్తుంది.
పంటకు నష్టాలు వాటిల్లిన పక్షంలో వెంటనే సమాచారం అందించేందుకు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్ 14447 వంటి సదుపాయలు అందుబాటులో ఉంటాయి. కాగా, ``మేరీ పాలసీ మేరే హాథ్`` క్యాంపెయిన్‌లో భాగంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి 8 రాష్ట్రాల్లో ఫసల్ బీమా అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..