Share News

Actor Suman: ఆయనే నా తొలి రాజకీయ గురువు.. సినీనటుడు సుమన్..

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:16 PM

అనంతపురంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన తొలి రాజకీయ గురువు సీఎం చంద్రబాబు అంటూనే.. రాజకీయాల్లోకి పునఃప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.

Actor Suman: ఆయనే నా తొలి రాజకీయ గురువు.. సినీనటుడు సుమన్..
Actor Suman

అనంతపురం జులై 5: అనంతపురంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైఎస్‌ఆ‌ర్‍‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఇంటికి వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం, పరిపాలనా దక్షత, విజన్ ఉన్న చంద్రబాబు వంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టమని అన్నారు. అలాగే తన పొలిటికల్ రీ-ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చారు సుమన్.


ఆయనే నా తొలి రాజకీయ గురువు: సుమన్..

తన తొలి రాజకీయ గురువు చంద్రబాబే అని.. ఆయన్ని చూసే సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని ఈ సందర్భంగా నటుడు సుమన్ గుర్తుచేసుకున్నారు. విజన్ ఉన్న ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరితగతిన పూర్తయి అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. తొలిసారి వాజ్ పేయి, చంద్రబాబు హయాంలో రాజకీయాల్లో అడుగుపెట్టానని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.


47 ఏళ్ల నటనానుభవం ఉన్న సినీ నటుడు సుమన్ 1978లో నీచల్ కులమ్(తమిళ)తో తెరగేంట్రం చేశారు. ఇద్దరు కిలాడీలు చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సుమన్.. 90వ దశకంలో తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించారు. అనంతరం క్యారెక్టర్, విలన్ రోల్స్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2021లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కాన్ని కూడా అందుకున్నారు. నటనలో కొనసాగుతూనే 1999 లో టీడీపీలో చేరిన సుమన్ పార్టీకి మద్ధతుగా పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, 2004లో బీజేపీలో చేరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

రాష్ట్రంలో.. ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

చిన్నారుల ఆవేదన విని చలించిపోయిన మంత్రి లోకేష్.. బడిబాట పట్టేందుకు సాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2025 | 08:19 PM