MLA Kuna Ravikumar: ఆరోపణలపై ఆధారాలు చూపించండి ..
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:53 PM
తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
శ్రీకాకుళం: తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. తాను జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించానని, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణమని చెప్పారు. వైసీపీ తోక నాయకులే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తాను శారీరకంగా , మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యేగా ఎవరితోనైనా మాట్లాడతానని స్పష్టం చేశారు.
తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. తాను అందరి ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని, సాక్షి మీడియా చెత్త రాతలు రాస్తోందన్నారు. అడ్మిషన్స్ విషయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమెతో మాట్లాడానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేతో వీడియో కాన్ఫరెన్స్‌కు ఆమె ఏ విధంగా హాజరైందో చూస్తే అర్ధమవుతుందని చెప్పారు. జూన్ 2న స్కూల్ తెరవకుండా 12న ఓపెన్ చేశారన్నారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోమని జిల్లా అధికారులు కోరినట్లు తెలిపారు. బదిలీ చేస్తే వేధింపులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. పొందూరు కేజీబీవీలో జాయినింగ్‌కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్‌ను సౌమ్య బెదిరించారని ఆరోపించారు. అక్కడ విధుల్లో జాయిన్ అవ్వవద్దు అంటూ కొత్త ప్రిన్సిపల్‌ను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.
తనపై నిరాధార ఆరోపణలు చేసిన సౌమ్యతో పాటు వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్ పేర్కొన్నారు. అలాగే అసెంబ్లీ ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తన నీడ కూడా తాకలేని గల్లీ వైసీపీ నాయకులు.. తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ.. కులం పేరితో బ్లాక్ మెయిల్ చేయటంలో సిద్ధహస్తురాలని చెప్పారు. ఇలాంటి కుట్రలు తనను ఏమీ చేయలేవని తెలిపారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ నీచ రాజకేయాలు చేయలేదని గుర్తు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేశారు.
Also Read:
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
ఈ మోసాలతో జాగ్రత్త..EPFO అలర్ట్..
For More Andhra Pradesh News and Telugu News..