KTR: చెల్లి కోసం అన్న పోరాటం.. అలా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఫైర్..

ABN, Publish Date - Mar 15 , 2024 | 06:46 PM

దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kavitha ) ను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.

దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kavitha ) ను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తన సోదరి కవిత అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ స్పందించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ అడ్డుకున్నారని ఈడీ అధికారుల పైన కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్టు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2024 | 06:46 PM