మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ..

ABN, Publish Date - Aug 17 , 2024 | 07:42 PM

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ ముగిసింది. అమరావతి పునఃనిర్మాణం, పోలవరం, వెనకబడిన జిల్లాలకు నిధులతోపాటు కొత్త రుణాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతి ప్రత్యేక సహాయం కింద రూ.15వేల కోట్లు ప్రకటించింది కేంద్రం.

ఢిల్లీ: ప్రధాని మోదీతో చంద్రబాబు(Chandrababu) భేటీ ముగిసింది. అమరావతి పునఃనిర్మాణం, పోలవరం, వెనకబడిన జిల్లాలకు నిధులతోపాటు కొత్త రుణాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతి ప్రత్యేక సహాయం కింద రూ.15వేల కోట్లు ప్రకటించింది కేంద్రం. అలాగే జగన్ హయాంలో రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిసింది. మరోవైపు కాసేట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 7గంటలకు అమిత్ షాను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 17 , 2024 | 07:45 PM