Shabbir Ali: ఆ విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ నేతలు
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:59 PM
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం, భూ కబ్జా, మని ల్యాండరింగ్ స్కాంలకి పాల్పడిందని.. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్దిచెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ (Congres) కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా: గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం, భూ కబ్జా, మని ల్యాండరింగ్ స్కాంలకి పాల్పడిందని.. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్దిచెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ (Congres) కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న అవినీతి నేటితో అంతమైందని చెప్పారు.
TG Politics: బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుంది: మహేశ్వర రెడ్డి
కామారెడ్డిలో అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని గద్దె దించడానికి సహకరించిన కౌన్సిలర్లకి కృతజ్ఞతలు తెలిపారు. భార్య భర్తలు మాట్లాడుకునే విషయాలను గులాబీ పార్టీ నేతలు ఫోన్ టాపింగ్ చేయడం దారుణమన్నారు. త్వరలో తెలంగాణ లోబీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని షబ్బీర్ అలీ అన్నారు.
Congress: కాంగ్రెస్లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి