Share News

Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా

ABN , Publish Date - Mar 30 , 2024 | 12:59 PM

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మితోపాటు ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు.

Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి (BRS) గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మితోపాటు (Vijaya lakshmi) ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు. ఇటీవల తాము బీఆర్ఎస్ పార్టీని వీడమని వెంకట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సోదరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నేత కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి పార్టీలో చేరికతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 66కి చేరుతుంది. మిగతా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Updated Date - Mar 30 , 2024 | 01:00 PM