Share News

Farmers: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయ్.. రికార్డు స్థాయిలో ధర

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:25 PM

Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి.‌ నిజామాబాద్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.

Farmers: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయ్.. రికార్డు స్థాయిలో ధర

నిజామాబాద్, మార్చి 14: పసుపు రైతులకు (Farmers) మంచి రోజులు వచ్చాయి.‌ నిజామాబాద్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పసుపు ధర (Turmeric Price) పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది. 2011లో ఆల్‌ టైం రికార్డు ధర రూ.16,166‌ కాగా.. ఈరోజు ఆ దాన్ని బ్రేక్ చేస్తూ క్వింటాల్ పసుపు రూ.20వేలు పలికింది. కాగా.. ఈసీజన్‌లో పసుపు ధర రూ‌.20వేలు దాటుతోందంటూ గత కొన్నాళ్లుగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెబుతున్న మాట ఈరోజు నిజమైంది. పసుపు ధర భారీగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

TG Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

TS Politics: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆరూరి రమేశ్


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 14 , 2024 | 12:25 PM