Share News

TG Politics: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ABN , Publish Date - May 26 , 2024 | 09:29 PM

మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshmareddy) మిర్యాలగూడలో మానవత్వం చాటుకున్నారు. విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ప్రమాదంతో..మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని మానవత్వంతో ఎమ్మెల్యే స్పందించారు.

TG Politics: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
MLA Bathula Lakshmareddy

నల్గొండ: మిర్యాలగూడ కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshmareddy) మానవత్వం చాటుకున్నారు. విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ప్రమాదంతో..మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని మానవత్వంతో ఎమ్మెల్యే స్పందించారు. స్టేషన్‌కు చేరుకొని ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అందజేశారు. రైల్వే మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించిన అధికారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


కాగా.. నల్గొండ జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు నిలిపివేశారు.అలాగే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు.దాదాపు రెండు గంటలుగా రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో మరమ్మతులకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కాగా నడికూడి స్టేషన్‌లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:57 PM