Share News

Congress: రెండు రోజులుగా కనిపించని కాంగ్రెస్ నేత.. కుటుంబీకుల ఆందోళన

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:48 AM

Telangana: అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...

Congress: రెండు రోజులుగా కనిపించని కాంగ్రెస్ నేత.. కుటుంబీకుల ఆందోళన
Congress leader Missing

సూర్యాపేట, ఏప్రిల్ 20: అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం..


ఏం జరిగిందంటే...

జిల్లాలోని ఎల్కారంకు చెందిన కాంగ్రెస్ వడ్డె ఎల్లయ్య రెండు రోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు కుటుంబసభ్యులు తెలియజేశారు. అప్పు వివాదం పరిష్కారం విషయమై మధ్యవర్తిగా వెళ్లి ఎల్లయ్య మాయమయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన అపర్ణ రూ.20 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే అప్పు తీసుకున్నప్పటికీ నుంచి దాన్ని తిరిగి ఇచ్చే విషయంలో అపర్ణను శ్రీనివాస్‌ ముప్పు తిప్పలకు గురిచేశారు. శ్రీనివాస్ ఎంతకూ డబ్బులు ఇవ్వక పోవడంతో చివరకు అప్పర్ణ.. కాంగ్రెస్ నేత ఎల్లయ్యను ఆశ్రయించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను కలిసేందుకు అపర్ణ, ఎల్లయ్య కలిసి జగ్గయ్యపేటకు వెళ్లారు. ఈనెల‌18న డబ్బులిస్తానని ఎల్లయ్యను శ్రీనివాస్ కారులో తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత ఎల్లయ్య ఫోన్ ఆఫ్ అవడంతో పాటు.. కొద్దిసేపటి తర్వాత అపర్ణ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎంతకీ ఎల్లయ్య నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్, సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో రెండు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్లయ్య, అపర్ణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారు?

AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 09:55 AM