Share News

MLA Vivekananda: రేవంత్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

ABN , Publish Date - Apr 21 , 2024 | 06:01 PM

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనాగరిక భాష మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) ఆరోపించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తమ నాయకులను తిడితే ఓట్లు పడవని అన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చే మొహంలేక ఫ్రస్టేషన్‌తో రేవంత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

MLA Vivekananda: రేవంత్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనాగరిక భాష మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) ఆరోపించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తమ నాయకులను రేవంత్ తిడితే ఓట్లు పడవని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే మొహంలేక ఫ్రస్టేషన్‌తో రేవంత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు రేవంత్‌ను నమ్మక పోవడంతో దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉండి దేవుళ్లను ఓట్లకు వాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు.


Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

రేవంత్ వ్యవహరంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులే రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులు బాధల్లో ఉంటే సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఎం కార్యాలయానికి వెళ్తే కరెంట్ లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే రేవంత్ తమను తిడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు ఆయన తిట్ల పురాణం ఆపి ఒట్టేసి చెప్పిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిస్తే రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది దుర్మార్గం, సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ కుదేలైందని చెప్పారు.

బిల్డింగ్స్ నిర్మాణానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎందుకు నిర్మాణ అనుమతులు ఇవ్వట్లేదని అడిగారు. అక్యూపెన్సీ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.అనుమతులు అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు.


ఇవి కూడా చదవండి

Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 06:12 PM