Share News

BRS: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:25 PM

మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఈ రోజు (మంగళవారం) భేటీ అయ్యారు. కేసీఆర్‌తో వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ.వివేకానంద గౌడ్, మాగంటి గోపినాధ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు.

BRS: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే..?
KCR

గజ్వేల్: మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఈ రోజు (మంగళవారం) భేటీ అయ్యారు. కేసీఆర్‌తో వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ.వివేకానంద గౌడ్, మాగంటి గోపినాధ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. ఫాం హౌస్‌కు వచ్చిన ఎమ్మెల్యే, నేతలతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేత చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారటం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.


ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగాయని అయినా భయపడలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. భవిష్యత్తులో పార్టీకి ‌ మంచి రోజులు వస్తాయన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టం లేదని చెప్పారు. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు.

Updated Date - Jun 25 , 2024 | 05:27 PM