Share News

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతాయి.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:40 PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతాయి.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

మెదక్ జిల్లా: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.


Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... త్వరలోనే చారిత్రక నిర్ణయాలు వచ్చే కేంద్ర ప్రభుత్వంలో ఉండబోతున్నాయని తెలిపారు. దేశ పురోగతి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ పాలన సాగుతోందన్నారు. పదేళ్లలో మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. దేశంలో పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించిన చరిత్ర మోదీదని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.


TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి

కాళేశ్వరంపై అవినీతి, ధరణిపై విచారణ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు టివి సీరియల్‌ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నామని ఆరోపించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్‌లో అసలు దోషులను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.


సామాజిక న్యాయం మోదీ వల్లే సాధ్యమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పనిచేసేది వారి కుటుంబాల కోసం మాత్రమేనని చెప్పారు. మోదీ దేశ ప్రజలందరి బాగు కోసం పని చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగు కాబోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు కాళ్లు లాకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కూడా ఖతం అవడం ఖాయమని లక్ష్మణ్ హెచ్చరించారు.


TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం

అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది: ఎంపీ అర్వింద్

నిజామాబాద్: అంబేద్కర్‌ను సైతం కాంగ్రెస్ మభ్యపెట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ బీజేపీ గెలిస్తే.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చుతారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.


అంబేద్కర్ ఆశయాలను మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు.1952, 1954 బై ఎలక్షన్‌లో అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌దని చెప్పారు.అంబేద్కర్‌ను మానసికంగా హింసించిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అంబేద్కర్ కాళ్లు కూడా తాకే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని అర్వింద్ అన్నారు.


Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 10:27 PM