Share News

Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:19 AM

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‏తో పొత్తులేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్లిస్‌ ఏ పార్టీకీ బీ టీం కాదని స్పష్టం చేశారు.

Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

- మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‏తో పొత్తులేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్లిస్‌ ఏ పార్టీకీ బీ టీం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం బహదూర్‌పురా శాసనసభ నియోజకవర్గ పరిధి ఫలక్‌నుమా ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుందని, అవగాహనతో పోటీ చేస్తుందనే ఆరోపణలను ఖండించారు. ఉత్తరప్రదేశ్‌లో పీడీఎం కూటమిలో మజ్లిస్‌ భాగస్వామి అని స్పష్టం చేశారు. తమిళనాడులో ఏఐఏడీఎంకేతో మజ్లిస్‌ పొత్తుపెట్టుకున్నట్టు వివరించారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బోగ్‌సఓట్లు ఉన్నాయన్న బీజేపీ నేతల ఆరోపణలను ఆయన ఖండించారు. నియోజకవర్గంలో దళితులు, బీసీలు, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్‌ ఓటర్లు ఉన్నారని, వారందరి ఓట్లతోనే తాము ఎన్నికల్లో విజయం సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్దమైన వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ)ను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఒవైసీ విమర్శించారు. సీఏఏ సమానత్వహక్కుకు విరుద్ధమని, మతం ఆధారంగా దీన్ని రూపొందించారని, పార్లమెంట్‌లో తాను తీవ్రంగా వ్యతిరేకించి బిల్లు ప్రతులను చించివేసినట్టు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష నేడు..

Updated Date - Apr 14 , 2024 | 08:23 AM