Share News

Konda Surekha: ఆ కేసులు బీఆర్ఎస్‌ను వేటాడుతున్నాయి

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:25 PM

లిక్కర్ కేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్‌ని వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి ,కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం నాడు పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్‌లో పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Konda Surekha:  ఆ కేసులు బీఆర్ఎస్‌ను వేటాడుతున్నాయి

సంగారెడ్డి జిల్లా: లిక్కర్ కేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్‌ని వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి , కాంగ్రెస్ (Congress) మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం నాడు పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్‌లో పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు‌లకు బుద్దిచెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజాధనాన్ని దోపిడి చేసిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టదని హెచ్చరించారు.

TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం

ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌కి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్, బీజేపీలు కైవసం చేసుకునేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ... కేసీఆర్‌కు ఓ బానిస, ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాటల మనిషే గాని చేతల మనిషి కాదన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు.

KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..: కేటీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:52 PM