Share News

TG Elections: నా గెలుపును ఆపలేరు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:33 PM

ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రజానివేదికలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ పార్టీ కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు.

TG Elections: నా గెలుపును ఆపలేరు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy

సికింద్రాబాద్: ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రజానివేదికలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ పార్టీ కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు.

అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తాను పని చేశానని అనిపిస్తేనే ఓటు వేయాలని కోరారు. తనకు ఓటు వేసిన ప్రజలు తలదించుకునే పని ఇంతవరకు చేయలేదన్నారు. తాను ఒక్క రోజు కూడా సమయం వృథా చేయకుండా ప్రజల కోసం పనిచేశానని తెలిపారు.


CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

తన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు.తాను పనులు ఇచ్చిన కాంట్రాక్టర్ మొహం కూడా ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేశానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత మంత్రులు కూడా తనను అసభ్యంగా ధూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారని అన్నారు.


Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తాను పని చేశానని భావిస్తేనే ఓటేయండి.. పనిచేయలేదు అనుకుంటే ఓటు వేయొద్దన్నారు. తన పార్టీ సహకారం, కార్యకర్తలు, ప్రజల కృషితోనే తాను గెలిచానని అన్నారు. మరోసారి సికింద్రబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. మరోసారి తనను ఆశీర్వదించి సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి

Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

Supreme Court: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. మరోసారి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 04:39 PM