Share News

Minister Ponguleti: ఇచ్చిన హామీలను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం

ABN , Publish Date - Jan 02 , 2024 | 08:25 PM

రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

Minister Ponguleti: ఇచ్చిన హామీలను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం

ఖమ్మం జిల్లా: రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాడన్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం కోసం ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రతి గడపకు వస్తుందన్నారు. ఈ ప్రజా పాలన దరఖాస్తు ద్వారా ప్రతి పేదవాడికి కావాల్సిన సౌకర్యాలను ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలనలో ప్రభుత్వం, అధికారులు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చి తీరుతామని చెప్పారు.

గత ప్రభుత్వం కట్టడాలు, శిలాఫలకాలతో కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ప్రజల బతుకులతో ఆడుకుందన్నారు. కాళేశ్వరం బ్రహ్మాండంగా కట్టామని కేసీఆర్ చెప్పాడని.. ఇలా ఎలా కట్టావని ఇప్పుడు ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఆ నాడు అధికారపక్షం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సాక్షిగా రంగలేసి గంతులు వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని ఎద్దేవా చేశారు. రూ.6 లక్షల 71 వేల కోట్ల భారం గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెట్టిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నవారు చెప్పిన హామీలు తప్పించుకోవడం కోసం అప్పుల గురించి మాట్లాడుతున్నారని అవాకులు చవాకులు పెలుతున్నారన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చి తీరుతామని చెప్పారు. ప్రజల ప్రభుత్వంలో వారికి అనుగుణంగానే ఇందిరమ్మ రాజ్యం పాలిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2024 | 08:26 PM