Share News

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తత.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:56 PM

మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ‌(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తత.. కారణమిదే..?

జయశంకర్ భూపాలపల్లి : మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ‌(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే ప్రాజెక్టు లోపలికి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను పోలీసులు అనుమతించలేదు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్యారేజీ మెయిన్ గేటు మూసి కార్యకర్తలను బ్రిడ్జి మీదకు పోలీసులు వెళ్లనివ్వలేదు.

లోపలికి వెళ్లనివ్వాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను సముదాయించడానికి ప్రయత్నం చేసిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు గేటును తోసుకొని మేడిగడ్డ బ్యారేజీపైకి గులాబీ పార్టీ కార్యకర్తలు. వెళ్లారు. తోపులాటలో ఓ‌ఎస్డీకి గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో కిందపడ్డ కార్యకర్తలు మహిళా కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బ్యారేజీ పైకి బీఆర్ఎస్ కార్యకర్తలు పరిగెత్తారు. దాంతో ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి..

Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం

TS Politics: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 06:56 PM