Share News

TS Politics: ఓట్ల కోసం మంగళ సూత్రాలు అమ్మకున్న నువ్వా మాట్లాడేది.. మంత్రి పొన్నం ఆన్ ఫైర్..

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:44 PM

Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్‌లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

TS Politics: ఓట్ల కోసం మంగళ సూత్రాలు అమ్మకున్న నువ్వా మాట్లాడేది.. మంత్రి పొన్నం ఆన్ ఫైర్..
Minister Ponnam Prabhakar

Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్‌లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓట్ల కోసం భార్య మంగళ సూత్రాలను అమ్మకున్న వ్యక్తివి నువ్వు మాట్లాడుతున్నావా? అంటూ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రొ పొన్నం ప్రభాకర్ కామెంట్స్..

‘నేను హిందువును.. మాంసం తినను.. రాముని జన్మభూమి ఎక్కడ అని నేను అనలేదు. అలా అంటే సజీవ దహనానికి నేను సిద్ధం. అమ్మ ప్రస్తావన తీసుకువచ్చింది ఎవరు? హుస్నాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మా అమ్మ ఆత్మఘోషిస్తుందని అన్న వెదవ ఎవడు? మళ్ళీ మా అమ్మ కాళ్ళు మొక్కుతా అంటున్నవా? బండి సంజయ్.. ఎప్పుడైనా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నామా? ఎన్నికల్లో ఓట్ల కోసం భార్య మంగళ సూత్రాలు అమ్మకున్న నీవు ఇలా మాట్లాడుతావా? ఎంపీగా గెలిస్తే నన్ను రాజీనామా చేస్తావా అంటావా? సిగ్గు ఉందా నీకు? గంగుల కమలాకర్, నువ్వు కుమ్మక్కు అయ్యారు’ అని తీవ్ర స్వరంతో, ఘాటైన వ్యాఖ్యలతో బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు మంత్రి పొన్నం ప్రభాకర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2024 | 01:44 PM