Share News

Telangana: మహాలక్ష్మి ఎఫెక్ట్.. మెట్రో రైళ్లల్లా ఆర్టీసీ బస్సులు..

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:11 PM

తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

Telangana: మహాలక్ష్మి ఎఫెక్ట్..  మెట్రో రైళ్లల్లా ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని రోజులు మహిళలందరికీ ఫ్రీ సర్వీసు అందించిన తర్వాత ఈ స్కీమ్ కు విధివిధానాలు రూపొందించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని ఖరారు చేశారు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలందరూ బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పరిస్థితి తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్ల తరహాలో సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండువైపులా మెట్రో రైలులో ఉన్నట్టుగా సీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఫలితంగా మద్యలో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణించటానికి వెసులుబాటుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని బస్సుల్లో సీటింగ్ మార్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం సక్సెస్ అయితే అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని తీసుకురానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 12:11 PM