TG ICET 2024 Results : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Jun 14 , 2024 | 05:45 PM
TG ICET 2024 Results : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, బర్త్ డేట్ ఆధారంగా ..
TG ICET 2024 Results : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వాకాటి కరుణ ఇద్దరూ కలిసి శుక్రవారం నాడు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, బర్త్ డేట్ ఆధారంగా అధికారిక వెబ్ సైట్ icet.tsche.ac.inలో ఫలితాలను తెలుసుకోవచ్చు.
కాగా, ఈ ఫలితాల్లో 91.92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో ఐసెట్-2024 ఎగ్జామ్ నిర్వహించారు. ఐసెట్ కోసం మొత్తం 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసెట్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in క్లిక్ చేయొచ్చు.
TG ICET 2024: ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్ టు స్టెప్ వివరాలను ఇక్కడ చూడొచ్చు.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్, icet.tsche.ac.in కి వెళ్లాలి.
2. హోమ్‌పేజీలో 'TG ICET 2024 రిజల్ట్స్/ర్యాంక్ కార్డ్' లింక్‌పై క్లిక్ చేయాలి.
3. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
4. లాగిన్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి.(రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ)
4. ‘సబ్‌మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
6. మీ రిజల్ట్స్‌ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.