Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:21 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
Phone Tapping Case

హైదరాబాద్, ఏప్రిల్ 07: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు.. వ్యక్తిగత లబ్ది కోసం మరికొందరు ప్రయత్నించినట్లు నిర్ధారించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. అదే అదునుగా ఓ కానిస్టేబుల్ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళల వ్యక్తిగత జీబితాలతో ఆడుకున్నట్లు విచారణలో తేలింది. పలువురు మహిళలను కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, అప్పటి జిల్లా పోలీస్ బాస్‌తో సదరు కానిస్టేబుల్‌కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చొరవతోనే ఉన్నతాధికారులను సైతం భయపెట్టాడట.


ఫోన్ ట్యాపింగ్‌తో జిల్లాలో పలు దందాల్లోనూ జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశాడు కానిస్టేబుల్. రౌడీ షీటర్లతో సెటిల్‌మెంట్స్ చేయించి.. గుర్రంపోడ్ వద్ద ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయం చేయించాడు. నార్కట్‌పల్లి వద్ద గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించిన సదరు కానిస్టేబుల్ వారిని వేధింపులకు గురి చేశాడట. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి.. కోట్లు వసూలు చేసినట్లు తాజా విచారణలో వెల్లడైంది. సుమారు 40 మంది మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశాడట. పేకాట దందాల్లో నెల నెలా మామూళ్లు వసూలు చేసేవాడట. ఇటీవలే ఈ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని హైదరాబాద్ టీమ్ అదుపులోకి తీసుకోగా.. విచారణలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయని సమాచారం.


ఇవి కూడా చదవండి:

హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!

వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2024 | 12:21 PM