Share News

Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..

ABN , Publish Date - Mar 18 , 2024 | 08:29 AM

ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది.

Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్: ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli)కి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం (DCM) వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ (Shamshabad) తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో హైదరాబాద్ - బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్‌ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికీ స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Congress: నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 08:56 AM