Home » Singer Mangli
గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు మంగ్లీపై ఆరోపణలు ఉన్నాయని, ఆ ఆరోపణలపై పోలీస్ విచారణ ముగిసే వరకు మూవీస్‌లో అవకాశం ఇవ్వవద్దని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు.
మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితులైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్‌లు పరారీలో ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్ల గురించి మంగ్లీకి సమాచారం ఉందని బాధితులు అంటున్నారు.
తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని చెప్పారు.
మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో తాను పాల్గొనలేదని జబర్దస్త్ నటుడు రచ్చ రవి అన్నారు. తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దయచేసి ఆ ఇష్యూలో తన పేరు వాడొద్దని విన్నవించుకున్నాడు.
ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది.