మధు ఆరోపణలు అవాస్తవం.. నేనే బాధితుడిని: హిమాకాంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:59 PM
మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితులైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్‌లు పరారీలో ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్ల గురించి మంగ్లీకి సమాచారం ఉందని బాధితులు అంటున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: తనకు రమావత్ మధు నుంచి ప్రాణహాని ఉందని హిమాకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై నిందితుడు రమావత్ మధు చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మధు చేసిన స్కామ్‌లో తానే బాధితుడినని చెప్పుకొచ్చారు. హిమాకాంత్ రెడ్డి తనని మోసం చేశాడని మైక్రో ఫైనాన్స్ కేసులో నిందితుడు రమావత్ మధు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోపై హిమాకాంత్ రెడ్డి గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘గోకులనంద ఇన్ఫా పేరుతో అనేక మందికి ఆశ చూపించి మధు డబ్బులు వసూలు చేశాడు. నేను 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆరోపణలు చేస్తున్నాడు. మరి నాపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు. నా దగ్గర నిజంగా10 కోట్ల రూపాయలు ఉంటే.. మధు నువ్వు స్వయంగా వచ్చి నాతో మాట్లాడు’..
‘రమావత్ మధు చేసిన ఈ స్కామ్ గురించి మంగ్లీకి మొత్తం తెలుసు. మంగ్లీ సొంత తమ్ముడు శివ చౌహన్ స్వయంగా చెప్పడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టండని శివ చౌహన్ చెప్పాడు. ఈ స్కామ్‌పై మేము ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తాం. మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నానని.. స్వయంగా మంగ్లీ చెల్లి ముందే మధు చెప్పాడు’ అని అన్నాడు.
కాగా, మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితులైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్‌లు పరారీలో ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్ల గురించి మంగ్లీకి సమాచారం ఉందని బాధితులు అంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామని మంగ్లీ తమ్ముడు శివ స్వయంగా తమతో చెప్పాడని బాధితులు చెబుతున్నారు. మధు అండ్ గ్యాంగ్ సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు, పబ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్
మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ: ఎంపీ శబరి