Share News

మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ: ఎంపీ శబరి

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:41 PM

దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రసంగించారు.

మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ: ఎంపీ శబరి
TDP MP Shabari speech

ఢిల్లీ, ఏప్రిల్16: దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు కలిగి ఉన్న ఈ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రసంగించారు. మహిళలకు ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తొలి పార్టీ టీడీపీనే అని ఆమె తెలిపారు.


'మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ. మహిళల కోసం ఎన్టీఆర్ తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మహిళలకు న్యాయం చేకూర్చేందుకు కోర్టులు ఏర్పాటు చేశాం. అలానే మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మహిళలను లక్షాధికారులను చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. టీడీపీ పాలనలో ఏపీ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాం. ప్రతి ఇంట్లో ఓ వ్యాపారవేత్తను తయారు చేయడం టీడీపీ లక్ష్యం' అని ఎంపీ శబరి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు

ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని తండ్రి పన్నాగం

Updated Date - Apr 16 , 2026 | 04:04 PM