సినిమాల్లో అవకాశాలు ఇవ్వకండి.. మంగ్లీపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు..
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:41 PM
గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు మంగ్లీపై ఆరోపణలు ఉన్నాయని, ఆ ఆరోపణలపై పోలీస్ విచారణ ముగిసే వరకు మూవీస్‌లో అవకాశం ఇవ్వవద్దని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18: ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. మూవీస్‌కు కానీ, ఈవెంట్స్‌కి కానీ అనుమతి ఇవ్వద్దని కోరారు. గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు మంగ్లీపై ఆరోపణలు ఉన్నాయని, ఆ ఆరోపణలపై పోలీస్ విచారణ ముగిసే వరకు మూవీస్‌లో అవకాశం ఇవ్వవద్దని ఫిర్యాదు చేశారు. బాధితులకు మంగ్లీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు
తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. గత బుధవారం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ.. తాను పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ తెలుసునని అన్నారు. నెల రోజులుగా ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ వదులుకున్నానని చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
వేసవిలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి?
నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్